బారికేడ్లకు ఒక ఉద్దేశం ఉంటుంది.. విదేశాలు తగలబడటం చూడటం లేదా?: CJP నేతలపై హైకోర్టు ఆగ్రహం

బారికేడ్లకు ఒక ఉద్దేశం ఉంటుంది.. విదేశాలు తగలబడటం చూడటం లేదా?: CJP నేతలపై హైకోర్టు ఆగ్రహం

పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వెనుక ప్రయోజనం ఉంటుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. బారికేడ్లు అవాంఛిత వ్యక్తులను నిషేధించేందుకే కదా, లేదంటే కొందరు మీ ఉద్దేశాన్ని చెడగొట్టేలా హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. నిషేధం విధించిన స్థలాలకు వెళ్లటం అంటే చట్టంపై గౌరవం లేనట్లే అంటూ కాక్రోచ్ జనతా పార్టీ ( సీజేపీ ) నేతలను కోర్టు మందలించింది. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాల్ చేస్తూ సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా వేసిన పిటిషన్ ను 2026 అక్టోబర్ 21న విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేుసింది.  

అక్టోబర్ 14 నుంచి నిర్బంధంలోనే సీజేపీ నేతలు..

సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు అక్టోబర్ 14 నుంచి న్యాయ నిర్బంధంలో ఉన్నారు. జంతర్ మంతర్ ను నిరసన స్థలంగా నిషేధించిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించారనే ఆరోపణలతో వారిని  అరెస్ట్ చేశారు. ఇదే జంతర్ మంతర్ వేదికపై CJP చీఫ్ అభిజిత్ దిప్కేతో కలిసి జూన్-జూలై నెలల్లో  నిర్వహించిన నిరసన కార్యక్రమం, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్టోబర్ ప్రారంభంలో జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలం జాబితా నుంచి తొలగించారు.

 అక్టోబర్ 19 ఆర్డర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ 

జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై  దాస్, రాంకా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) అక్టోబర్ 19న  న్యాయ నిర్బంధాన్ని మరో రెండు రోజులు పొడగిస్తూ ఇచ్చిన ఆదేశాన్ని సవాలు చేశారు. 

 బెయిల్ బాండ్లు ఇచ్చి, షూరిటీ ఇచ్చిన తర్వాత  వాటిని ఉల్లంఘిస్తే BNSS కింద ఒక నిర్దిష్ట విధానం ఉంటుంది. జామీన్ జప్తు చేయడం వంటి విధానాన్ని అనుసరించకుండా మీకు కొత్త నోటీసు ఇచ్చారంటే, పోలీసు అధికారులు మీ పట్ల ఉదారంగా వ్యవహరించినట్టే కాదా? అని సీజేపీ నేతలతో కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్లు అనుమతి లేకుండా బారికేడ్లు దాటారని, నిరసన కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నారని హైకోర్టు ఎత్తిచూపింది.

 బారికేడ్‌కు ఒక ఉద్దేశం ఉంటుంది.. అది దాటినప్పుడు 10-20 మంది చొచ్చుకొచ్చే అవకాశం ఉంటుంది  అని న్యాయమూర్తి, దాస్-రాంకాల న్యాయవాది అభిక్ చిమ్నీకి తెలిపారు. విదేశాల్లో జరిగిన నిరసనలు, అగ్నిప్రమాదాలు, అల్లర్లను  కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.

 మన దేశం వెలుపల ఏం జరుగుతుందో చూస్తున్నాం.. మీరు శాంతియుతంగా మొదలుపెట్టారని చెప్పవచ్చు. అందుకే పోలీస్ అనుమతి తీసుకుంటారు — అవాంఛిత వ్యక్తులు మీ గ్రూప్‌లో చేరి మీ పేరు మంటగలిపే పరిస్థితిని నివారించేందుకే పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఫ్రాన్స్‌లో చెలరేగిన హింసాత్మక నిరసనలను కోట్ చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

ALSO READ ; అది భారత అంతర్గత విషయం

జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై హైకోర్టులో  వాదించే బదులు, రివిజనల్ కోర్టు (ట్రయల్ కోర్టు) దగ్గర ముందు అడిగి, తర్వాత హైకోర్టుకు రావొచ్చు కదా?  అని కోర్టు  ప్రశ్నించింది.

మీరు Gen Z కాదు

విచారణ మధ్యలో దాస్, రాంకాల వయసు ఎంతని కోర్టు అడగగా — వరుసగా 27, 32 అని చిమ్నీ సమాధానమిచ్చారు. దానికి కోర్టు స్పందిస్తూ — అంటే మీరు Gen Z కాదు. 1997 తర్వాత పుట్టినవారే Gen Z అని కోర్టుకు తెలుసని వ్యాఖ్యానించింది.

బెయిల్ బాండ్ ను ఎందుకు ఉల్లంఘించారు.?

బెయిల్ బాండ్లు ఇచ్చిన తర్వాత జంతర్ మంతర్‌లో అనుమతి లేకుండా అడుగుపెట్టడం ద్వారా వాటిని ఉల్లంఘించారనే అంశంపై హైకోర్టు విచారణ చేసింది. అక్టోబర్ 11న — జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన వేదిక జాబితా నుంచి తొలగించిన అదే రోజు — అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ బెయిల్ బాండ్లు ఇచ్చారని కోర్టు గుర్తుచేసింది. బెయిల్ బాండ్ ఉల్లంఘన విషయంలో BNSS కింద నిర్దేశించిన విధానం ఎందుకు పాటించలేదని కోర్టు ప్రశ్నించింది.