అది భారత అంతర్గత విషయం: సీజేపీ నిరసనలపై అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు

అది భారత అంతర్గత విషయం: సీజేపీ నిరసనలపై అమెరికా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు

 కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలపై ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పందించారు. భారత పర్యటనలో ఉన్న రుబియో 2026 అక్టోబర్ 21న మాట్లాడుతూ.. సీజేపీ నిరసనలు భారత అంతర్గత రాజకీయ అంశమని పేర్కొన్నారు. 

 ఐక్యరాజ్యసమితి  నిపుణుల విమర్శలను తోసిపుచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ జరుగుతున్న ఈ నిరసనలు భారత్ అంతర్గత రాజకీయ విషయమని, వాషింగ్టన్ దానిపై వ్యాఖ్యానించదని స్పష్టం చేశారు. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి.   దేశ అంతర్గత రాజకీయ విషయాలపై తన అభిప్రాయం చెప్పలేనని అన్నారు. 

శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్య దేశాలలో సాధారణమని అన్నారు.  అమెరికాలో కూడా ప్రతిరోజూ నిరసనలు జరుగుతుంటాయని పేర్కొన్నారు.  అయితే యూరప్‌లో జరుగుతున్నట్లు హింసాత్మక అల్లర్లు, భవనాలను కాల్చడం వంటివి కాదని స్పష్టం చేశారు. క్యూబా లాంటి దేశాలలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేదని, జైలు లేదా బహిష్కరణ ముప్పు అక్కడ ఉందని ఉదహరించారు.

ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగించినందుకు ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.  

ALSO READ : మీరు జెన్ జీ కాదు..

మంగళవారం (అక్టోబర్ 20) 20 మందికి పైగా యూఎన్ మానవ హక్కుల నిపుణులు భారత్‌లో నిరసనలను అణచివేసిన విధానంపై స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. పోలీసులు  బలప్రయోగం చేశారని, అక్రమ అరెస్టులు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన భారత్.. ఈ విమర్శలను దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడింది.