మీరు జెన్ జీ కాదు.. సీజేపీ నేతల పిటిషన్ ఉపసంహరణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు

మీరు జెన్ జీ  కాదు.. సీజేపీ నేతల  పిటిషన్ ఉపసంహరణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ ల వయసుపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు జెన్ జీ కాదని పేర్కొంది. తమ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగింపును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.  

జంతర్ మంతర్ దగ్గర జాతీయ జెండా ఊపుతూ నిరసన తెలిపినందుకు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ  నేతలు 2026 అక్టోబర్ 21 ( బుధవారం)  జ్యుడిషియల్ కస్టడీని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. 

స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్‌ఈఎం) జారీ చేసిన జ్యుడీషియల్ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా డీ-నోటిఫై చేసిన తర్వాత అక్కడ జాతీయ జెండా ఊపినందుకు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా సుబ్రమణ్యం ప్రసాద్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చారు. అయితే కోర్టు వారి వయస్సుల గురించి ప్రశ్నించింది. సౌరవ్ దాస్ 27 ఏళ్లు, అశుతోష్ రంకా 31 ఏళ్లు అని తెలిపారు. 1997 తర్వాత పుట్టినవారు జెన్ జెడ్ అని కోర్టు సూచించింది.  మీరు జెన్ జెడ్ కాదు కదా అని వ్యాఖ్యానించింది.

ALSO READ : భారత్‌లో టాలెంట్‌కు విలువ లేదా? ఇన్వెస్టర్లు లేక బిజినెస్ అమ్మేసుకుని అమెరికా వెళ్లిన స్టార్టప్ ఓనర్

నిరసన తెలిపే హక్కు ఉందని అంగీకరిస్తూనే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు ఎన్నికల ద్వారానే జరగాలని కోర్టు స్పష్టం చేసింది. పోలీసు అధికారులు వారి పట్ల సహనం చూపారని కూడా పేర్కొంది. గతంలో ఎస్‌ఈఎం ముందు సంతకం చేసిన బాండ్‌ను ఉల్లంఘించారని న్యాయమూర్తి అన్నారు. మీకు పరిష్కారం రివిజన్ కోర్టులో దొరుకుతుంది. ఆర్టికల్ 226 కింద ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు అని కోర్టు సూచించింది.