డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛానల్ పెడుతున్నారని.. తన పదవికి రాజీనామా చేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. త్వరలోనే బిగ్ ట్విస్ట్ రానుందంటూ వార్తలు సర్కులేట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం.
సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు జనసేన నేతలు, డిప్యూటీ సీఎం కార్యాలయం. ఈ ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులు కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.వైసీపీ నేతలే వెనుకుండి ఈ విష ప్రచారం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు. ఫేక్ ప్రచారం చేస్తున్న ముఠాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అసలే స్థానిక ఎన్నికల సందర్భంగా ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిన క్రమంలో పవన్ కళ్యాణ్ రాజీనామా వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మరి, ఈ ప్రచారం వెనుక ఉన్నది ఎవరు..? ఆ ముఠాను పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్నది వేచి చూడాలి.
