యూట్యూబ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరైన మౌళి.. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో హీరోగా మారి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. యూత్‌ను ఆకట్టుకునే కామెడీ, తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మరో ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే 'దొంగ నా కొడుకు'. టైటిల్‌తోనే ఆసక్తి రేపుతున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
నవ్వులే నవ్వులు..
టీజర్‌ను చూస్తే ఇదొక క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో మౌళి ఈశ్వర్ అనే యువకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. పనీపాటా లేకుండా తిరుగుతూ, ఇంట్లో వాళ్లకు తలనొప్పిగా మారే కుర్రాడిగా అతడి పాత్రను పరిచయం చేశారు. తండ్రి పాత్రలో నటుడు అలీ కనిపిస్తూ తన కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన వ్యక్తిగా అలరిస్తున్నాడు.
కుటుంబానికి డబ్బు అవసరం కావడం, ఈశ్వర్ పరిస్థితులు అతడిని దొంగతనం చేసేలా నెట్టడం చుట్టూ కథ తిరుగుతున్నట్లు టీజర్ సూచిస్తోంది. మరి ఓ సాధారణ కుర్రాడు దొంగగా మారిన తర్వాత అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఆ ప్రయత్నంలో ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? అన్నది తెరపై చూడాల్సిందే...
ALSO READ : అసలు టార్గెట్ సల్మాన్ ఖాన్.. తర్వాత టైగర్ ష్రాఫ్‌పై గురి?
మౌళి కామెడీ టైమింగ్..
టీజర్లో యూత్‌ఫుల్ మూమెంట్స్‌తో పాటు కామెడీ పంచ్‌లు ఆకట్టుకుంటున్నాయి. 'లిటిల్ హార్ట్స్' తర్వాత మౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై యువ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సుస్మితా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, శ్రీను కంబాల ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది. మరి 'దొంగ నా కొడుకు'తో మౌళి మరోసారి తన కామెడీ మ్యాజిక్ చూపించి హిట్ అందుకుంటాడా? తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే..
