ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన అభిమానులకు ఓ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దసరా పండుగ సందర్భంగా కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి కొత్త కారుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో రాహుల్ దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పండుగ వేళ కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శుభకార్యాలు ప్రారంభించడం చాలామందికి ఆనవాయితీ. ఇదే తరహాలో రాహుల్ సిప్లిగంజ్ కూడా దసరా సందర్భంగా తన ఇంటికి కొత్త కారును తీసుకొచ్చారు. ఆయన కొనుగోలు చేసింది ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన కారు. కొత్త వాహనంతో భార్య హరిణ్యతో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన రాహుల్.. ఆ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
"దుర్గామాత ఆశీస్సులతో ఈ ప్రత్యేకమైన సందర్భంలో కొత్త వాహనం" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రాహుల్. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ కొనుగోలు చేసిన టెస్లా కారు ధర సుమారు రూ.70 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఆయన గ్యారేజ్‌లో మెర్సిడెస్ బెంజ్, వోల్వో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు టెస్లా కూడా చేరడంతో ఆయన కార్ల కలెక్షన్ మరింత ఆకర్షణీయంగా మారింది.
ALSO READ : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్టోబర్ 23న 'ఫౌజీ' నుంచి సర్‌ప్రైజ్!
'ఆర్ఆర్ఆర్'సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్లేబ్యాక్ సింగర్‌గా రాణిస్తూనే వ్యాపార రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. గతేడాది నవంబర్ 27న హరిణ్య రెడ్డిని వివాహం చేసుకున్న రాహుల్.. ఇప్పుడు భార్యతో కలిసి కొత్త కారును సొంతం చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు..
