హైదరాబాద్: ఏపీకి చెందిన ప్రేమ జంట పెండ్లి కోసం దొంగతనాల బాట పట్టారు. అయితే.. ఈ దొంగ ప్రేమ జంటను వనస్థలిపురం పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేశారు. వనస్థలిపురం రాజరాజేశ్వరి దేవాలయంలో ఈ ప్రేమజంట వృద్ధురాలు మెడలో బంగారు గొలుసు చోరీ చేసి పారిపోయారు.
నిందితులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్నపురెడ్డి, వరలక్ష్మిగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకోవడానికి ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రేమజంట ఇలా చోరీల బాట పట్టింది. పోలీసులు నిందితుల నుంచి 3 తులాల బంగారు గొలుసు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ : మూడు రోజుల్లో రూ.25 కోట్ల మందు తాగారు
ఒక్క స్నాచింగ్ చేస్తే తక్కువలో తక్కువ రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా చేతికి అందుతుండడంతో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఒంటరి, వృద్ధ మహిళలను టార్గెట్‌చేసి బంగారం ఎత్తుకెళ్తున్నారు. గంజాయి, బెట్టింగులు, జల్సాలకు బానిసలైనవారు ఈజీ మనీ కోసం వృద్ధులను టార్గెట్‌చేసి బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఈ క్రమంలో కొందరు హత్యలకూ వెనకాడటం లేదు.
