న్యూఢిల్లీ : అండర్-19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ ప్రాచీ తోకస్ పతకాన్ని ఖాయం చేసింది. మాంటెనెగ్రోలో జరుగుతున్న టోర్నీలో మహిళల 80+ కేజీల విభాగంలో సెమీఫైనల్‌కు చేరింది. మంగళవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో సమోవాకు చెందిన కీలీ పెరెజ్‌పై మూడు రౌండ్లలోనూ విజయం సాధించింది. దీంతో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది.
ఆసియా అండర్-19 చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన ప్రాచీ.. సెమీఫైనల్లో రష్యా బాక్సర్ సమీరా ఇటోనియేవాతో తలపడనుంది. మరోవైపు హర్షిక, లక్షు కూడా ప్రీ క్వార్టర్ ఫైనళ్లలో విజయాలు సాధించి పతకానికి మరో అడుగు దూరంలో నిలిచారు.
మహిళల 65 కేజీల విభాగంలో హర్షిక 4-0తో ఆస్ట్రేలియాకు చెందిన టియానా ర్యూను ఓడించింది. మహిళల 70 కేజీల విభాగంలో లక్షు 3-2తో టర్కీ బాక్సర్ బుసె నూర్ యాహన్‌పై గెలిచింది.
