- ఓవరాల్ స్టాండింగ్స్ లో ఐదో స్థానం
- 10 ఐదు స్వర్ణాలతో దూసుకెళ్లిన భారత అథ్లెట్లు
నాగోయా: ఆసియా పారా గేమ్స్ లో భారత అథ్లెట్లు పతకాల వర్షం కురిపించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో అద్భుత ప్రదర్శనతో ఒక్కరోజే 22 పతకాలు సాధించారు. ఇందులోఐదుస్వ ర్ణాలు ఉండగా.. సిమ్రాన్, హైజంపర్ ప్రవీణ్ కుమార్, షాట్పుటర్ సచిన్ ఖిలారీ తమ ఈ వెంట్లలో గేమ్స్ రికా ర్డులు నెలకొల్పారు. వరంగల్కు చెందిన దీప్తి జీవాంజి గోల్డ్ మెడల్ సాధించింది. భారత్ మొత్తం 62 పతకా లతో పతకాల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ పోటీలు శనివారం ముగియనున్నాయి.
సిమ్రాన్ డబుల్ ధమాకా..
మహిళల 100 మీటర్ల టీ12 విభాగంలో చూపులేని అథ్లెట్ సిమ్రాన్ 12.02 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణం సాధించింది. ఇరాన్ కు చెందిన హజర్ సఫర్జా దే 12.30 సెకన్లతో రజతం గెలిచింది. అంతకుముం దు. మహిళల 200 మీటర్ల విభాగంలోనూ సిమ్రాన్ స్వర్ణం సాధించింది. రెండు రోజుల్లోనే రెండు స్వర్ణాలు గెలవడంతో పాటు రెండు గేమ్స్ రికార్డులు నెలకొల్పిం ది.
పురుషుల హైజంప్44/64విభాగంలో ప్రవీణ్ కుమార్ స్వర్ణం గెలవగా, ఇదే ఈవెంట్లో బంటి రజతం సాధించాడు. పురుషుల షాట్పుట్ ఎఫ్46 విభాగంలో సచిన్ ఖిలారీ పసిడి పతకం సొంతం చేసు కున్నాడు మహ్మద్ యానర్ రజతం, పర్వీస్ కాంస్యం గెలిచారు. పురుషుల షాట్పుట్ ఎఫ్53 విభాగంలో ఆయుష్ వర్మ భారత్కు మరో స్వర్ణం అందించాడు. పురుషుల 100 మీటర్ల టీ46/47 విభాగంలో దిలీప్ గావిట్ 10.69 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి
మరోసారి సత్తా చాటిన వరంగల్ బిడ్డ
దీప్తి జీవాంజికి వరుసగా రెండోసారి ఆసియా పారా గేమ్స్ లో గోల్డ్ మెడల్
400 మీటర్ల పరుగులో 56.36 సెకన్లలో లక్ష్యానికి చేరి రికార్డ్
నాగోయా: తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజి ఆసియా పారా గేమ్స్ లో మరోసారి సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సాధించింది. మంగళవా రం జరిగిన పోటీలో 56.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కొత్త గేమ్స్ రికార్డు నెలకొల్పింది.
ఇప్ప టికే ఆసియా రికార్డు సొంతం చేసుకున్న దీప్తి మరోసారి ఖండాంతర స్థాయిలో తన ఆధిపత్యా న్ని చాటింది.ఈ పోటీలో జపాన్కు చెందిన సీనా కన్నో 58.92 సెకన్లతో రజతం గెలవగా, అదే దేశానికి చెందిన అకానే కటో 1:00.26 నిమిషా లతో కాంస్య పతకం సాధించింది. తెలంగాణలో ని వరంగల్ ప్రాంతానికి చెందిన దీప్తి ప్రతిభను సాధించగా, మహ్మద్ మోర్సింగనకత్ బాసిల్ 10.72 సెకన్లతో రజతం గెలిచాడు.
ఇతర విభాగాల్లోనూ పతకాలు
మహిళల షాట్పుట్లో భాగ్యశ్రీ జాదవ్, పురుషుల జావెలిన్ త్రోలో మన్జీత్ రజతాలు సాధించారు. మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో ప్రీతి పాల్ రజతం గెలిచింది. పారా ఆర్చరీలో శీతల్ దేవి, రాకేశ్ కుమార్ జోడీ రజతం సాధించింది. పారా స్విమ్మింగ్‌లో రవి కార్తిక్ బుదిగినా రెండో రజతం గెలవగా, హిమాంషు నందల్ కాంస్యం అందుకున్నాడు.
పవర్‌లిఫ్టింగ్‌లో కస్తూరి రాజమణి రజతం సాధించింది. ఇప్పటివరకు భారత్ 14 స్వర్ణాలు, 22 రజతాలు, 26 కాంస్యాలతో మొత్తం 62 పతకాలు సాధించింది. వీటిలో అథ్లెటిక్స్ నుంచే 41 పతకాలు రావడం విశేషం. పోటీల్లో పాల్గొం టున్న 62 ఈవెంట్లలో 60 పతకాలు సాధించాలనే లక్ష్యంతో భారత అథ్లెట్లు ముందుకు సాగుతున్నారు.
