దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో 179 రన్స్ చేసి చరిత్ర సృష్టించాడు. ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ఆస్ట్రేలియా కెప్టెన్ 76 ఏళ్ల రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
సౌతాఫ్రికాలోని గ్కెబెర్హాలో జరుగుతున్న టెస్టులో జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉండగా బవుమా రయాన్ రికెల్టన్, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మూడో రోజు చివర్లో బవుమా అవుటైన తర్వాత దక్షిణాఫ్రికా 425/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
బవుమా సాధించిన రికార్డులు:
ఆస్ట్రేలియాపై టెస్టులో అత్యంత పెద్ద వయసులో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన కెప్టెన్‌గా బవుమా రికార్డు సృష్టించాడు. ఆయన వయసు 36 ఏళ్ల 154 రోజులు. గత రికార్డు అజహరుద్దీన్ పేరిట ఉంది. ఆయన 1998లో కోల్‌కతాలో 35 ఏళ్ల 38 రోజులు వయసులో163 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికాలో టెస్టు ఇన్నింగ్స్‌లో 150+ సాధించిన ఓల్డెస్ట్ కెప్టెన్‌గా కూడా బవుమా నిలిచాడు. 1950లో అదే వేదికపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆర్థర్ లిండ్సే హాసెట్ 167 పరుగులు చేసిన తర్వాత 76 ఏళ్ల తర్వాత ఇలాంటి ఘనత సాధించిన మొదటి కెప్టెన్ బవుమా.
ALSO READ : ధోనీ పాటించే 7 ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్స్..
బవుమాకు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా హోమ్‌లో చేసిన నాలుగో అత్యధిక స్కోర్ ఇది. హషీమ్ అమ్లా (208, 201), గ్రేమ్ స్మిత్ (183) తర్వాత బవుమా ఆ ఫీట్ సాధించాడు.
