వైభవ్ ఎంట్రీ ఇప్పటికిప్పుడు కష్టమే: తేల్చి చెప్పిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

వైభవ్ ఎంట్రీ ఇప్పటికిప్పుడు కష్టమే: తేల్చి చెప్పిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

టీ20లో పర్మనెంట్ ప్లేస్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇప్పటికిప్పుడు కష్టమేనని తేల్చి చెప్పాడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. వైభవ్ చాలా చిన్న వయసులోనే టీమిండియాకి ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ కొట్టేశాడు. అతడికి మంచి మంచి అవకాశాలు వస్తాయి.. కానీ ఇప్పుడు కాదు అని చెప్పాడు.

ప్రస్తుం ఇండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ నిలకడగా ఆడుతున్నారని.. మంచి ఫామ్ లో ఉన్నారని.. ఈ టైమ్ లో వైభవ్ ప్లేయింగ్ లెవెన్ లోకి ఎంట్రీ అంత ఈజీ కాదని అన్నాడు. ఈ ఇద్దరూ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారని.. టీ20 వరల్డ్ కప్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించినట్లు కొనియాడాడు. 

వైభవ్ లాంటి ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్ లో సంతోషంగా ఉండటం ముఖ్యం అని.. న్యూజీలాండ్ తో ఐదు మ్యాచ్ ల గురించి మాట్లాడుతున్న సందర్భంగా చెప్పాడు. 

ఈ ఏడాది ఇంగ్లండ్, ఐర్లండ్ టూర్లకు సెలెక్ట్ చేసిన నాటి నుంచి వైభవ్ 21 మ్యాచ్ లకు గానూ 8 మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 

ALSO READ : ఇండియా లాంగ్ స్టాండింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్

అయితే ఆసియన్ గేమ్స్ లో వైభవ్ కు చోటు ఇచ్చేందుకు సంజూను మూడో నంబర్ కు మార్చారు. అయితే ఓవర్సీస్ కు వస్తున్న వైభవ్.. విదేశీ పిచ్ లపై ఎలా ఆడాలనేదానిపై ఒక ఐడియా వస్తుందని పేర్కొన్నాడు. ఫ్యూచర్ లో విదేశీ మ్యాచ్ లలో ఆడేందుకు వచ్చినపుడు ముందుగానే ప్రిపేర్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని అయ్యర్ చెప్పాడు.