న్యూజిలాండ్‌‌తో నేడు ( అక్టోబర్ 22 న ) భారత్‌‌ తొలి టీ20

న్యూజిలాండ్‌‌తో నేడు ( అక్టోబర్ 22 న )  భారత్‌‌ తొలి టీ20
  • శ్రేయస్‌‌ అయ్యర్‌‌ సేనకు పేస్‌‌ పరీక్ష
  •     బ్యాటింగ్‌‌పైనే ప్రధాన ఆశలు


క్రైస్ట్‌‌చర్చ్‌‌ : న్యూజిలాండ్‌‌తో ఐదు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌కు భారత జట్టు సిద్ధమైంది. గురువారం జరిగే తొలి మ్యాచ్‌‌లో ప్రయాణ అలసటను అధిగమించి విజయం సాధించాలని శ్రేయస్‌‌ అయ్యర్‌‌ సేన భావిస్తోంది. మ్యాచ్‌‌ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. అభిషేక్‌‌ శర్మ, తిలక్‌‌ వర్మ, సంజు శాంసన్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌ వంటి దూకుడైన బ్యాటర్లపై భారత్‌‌ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే న్యూజిలాండ్‌‌ పేస్‌‌కు అనుకూలించే పిచ్‌‌లపై రాణించడం సవాలుగా మారనుంది. హార్దిక్‌‌ పాండ్యా గాయంతో దూరం కాగా, జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా వన్డేలు, టెస్టులకే పరిమితం కానున్నాడు.

దాదాపు నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్‌‌ కుమార్‌‌ తిరిగి టీ20 జట్టులోకి రావడం, వరుణ్‌‌ చక్రవర్తి అందుబాటులో ఉండటం బౌలింగ్‌‌కు బలాన్నివ్వనుంది. బౌలింగ్‌‌ విభాగం మెరుగుపడాల్సి ఉందని కెప్టెన్‌‌ అయ్యర్‌‌ అభిప్రాయపడ్డాడు. ప్రయాణ అలసట ఉన్నప్పటికీ భారత జట్టు ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది.