సోవిమా (నాగాలాండ్): మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో క్వాడ్రఫుల్ సెంచరీ (517 బాల్స్‌లో 46 ఫోర్లు, 7 సిక్స్‌లతో 400)తో హోరెత్తించాడు. ఫలితంగా ఇండియా క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. 78 ఏళ్ల కిందట ముంబై బ్యాటర్ భావసాహెబ్ నింబాల్కర్ (1948లో కఠియావార్‌పై 443*) ఈ ఘనత సాధించాడు.
ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన డాన్ బ్రాడ్‌మన్ (452*), బ్రియాన్ లారా (501*) సరసన చేరాడు. ఒక ఇన్నింగ్స్‌లో 400లు అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోరు సాధించిన పదో బ్యాటర్ సుతార్. హనీఫ్ మహ్మద్ (499), డాన్ బ్రాడ్‌మన్ (452*), బిల్ పాన్సర్డ్ (429, 437), అతాబ్ బలోచ్ (428), సామ్ నార్త్‌ఈస్ట్ (410*), గ్రాహం హిక్ (405*), బ్రియాన్ లారా (400*) ముందున్నారు.
