న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ యాంకర్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. రూ.8,110 కోట్ల విలువైన యాంకర్ బుక్ కోసం 30 రెట్లు అధికంగా..అంటే దాదాపు రూ.2.50 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. బ్లాక్‌రాక్, ఫిడిలిటీ, జేపీ మోర్గన్, సింగపూర్ జీఐసీ, అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్లు, ఎల్ఐసీ ఇందులో పాల్గొన్నాయి.
ప్రధాన ఫండ్లకు రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల చొప్పున, ఇతర ఇన్వెస్టర్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువైన షేర్లు కేటాయించే అవకాశం ఉంది. మొత్తం 27 కోట్ల కొత్త షేర్లతో రూ.30,213 కోట్లు సమీకరించేందుకు వస్తున్న ఈ మెగా ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగుస్తుంది. షేరు ధరల శ్రేణిని రూ.1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించారు. 108 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను ఆశిస్తున్న జియోకు జూన్ 2026 నాటికి 53.33 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.
