అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.1,501 కోట్లు..రూ.2,660 కోట్లతో నర్మించిన ఏపీ ప్లాంటు షురూ 

అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.1,501 కోట్లు..రూ.2,660 కోట్లతో నర్మించిన ఏపీ ప్లాంటు షురూ 

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 21.27 శాతం పెరిగి రూ.1,501.38 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో  రూ.1,237.98 కోట్లు వచ్చాయి. అమ్మకాలు పెరగడం, ఖర్చుల అదుపు, ప్రీమియం ఉత్పత్తులపై దృష్టి పెట్టడం లాభాల వృద్ధికి తోడ్పడ్డాయి. ఆదాయం రూ.19,606.93 కోట్ల నుంచి 18.81 శాతం ఎగిసి రూ.23,295.07 కోట్లకు పెరిగింది.

ఇతర ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం 18.44 శాతం పెరిగి రూ.23,405.96 కోట్లుగా నమోదైంది. మొత్తం ఖర్చులు 18.44 శాతం పెరిగి రూ.21,338.88 కోట్లకు చేరాయి. దేశీయ గ్రే సిమెంట్ అమ్మకాలు 13.8 శాతం పెరిగి 35.94 మిలియన్ టన్నులకు, వైట్ సిమెంట్ ఉత్పత్తి 2.6 శాతం పెరిగి 0.52 మిలియన్ టన్నులకు చేరాయి. కన్సాలిడేటెడ్ అమ్మకాలు 12.9 శాతం పెరిగి 38.22 మిలియన్ టన్నులకు చేరాయి.   కంపెనీ ఆంధ్రప్రదేశ్​ నంద్యాలలో కొత్త ప్లాంటును ప్రారంభించింది. దీనికోసం రూ.2,660 కోట్లు పెట్టుబడి పెట్టింది.