ఫిలిప్స్ పండుగ ఆఫర్స్

ఫిలిప్స్ పండుగ ఆఫర్స్

హైదరాబాద్​, వెలుగు:  ఫిలిప్స్ హోమ్ అప్లయెన్సెస్ ఫెస్టివల్​ ఆఫర్స్​ ప్రారంభించింది. ఈనెల 11 నుంచి నవంబర్ 11 వరకు సాగే ఈ ఆఫర్ ద్వారా దేశంలోని 112 నగరాల్లో 20 కోట్ల మందికి పైగా వినియోగదారులను చేరుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో భాగంగా కనీసం రూ.1,500 ధర ఫిలిప్స్ గృహోపకరణాలు కొనుగోలు చేసే కస్టమర్లకు కచ్చితమైన బహుమతి లభిస్తుంది. దీంతో పాటు ప్రతి గంటకు రూ.9,999 విలువైన బంగారం, ప్రతిరోజూ రూ.50 వేల విలువైన వజ్రం గెలుచుకోవచ్చు. గతేడాది 70 నగరాల్లో నిర్వహించిన సోనే పే సుహాగా ప్రచారానికి వచ్చిన ఆదరణతో ఈసారి రెట్టింపు ప్రయోజనాలతో ఈ ఆఫర్ తెచ్చారు.