అమెరికాలో రోడ్డున పడుతున్న NRI టెక్కీలు.. రాత్రికిరాత్రే ఇండియాకు తిరుగు ప్రయాణం

అమెరికాలో రోడ్డున పడుతున్న NRI టెక్కీలు.. రాత్రికిరాత్రే ఇండియాకు తిరుగు ప్రయాణం

డాలర్ కలలతో అమెరికాలో అడుగుపెట్టిన వేల ఇండియన్ ఫ్యామిలీస్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో జరుగుతున్న భారీ లేఆఫ్స్ కారణంగా వేలాది మంది NRIలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రోడ్డున పడుతున్నారు. H-1B వీసా నిబంధనలు కఠినతరం కావడం, I-140 పిటిషన్లు పెద్ద ఎత్తున తిరస్కరణకు గురికావడంతో ప్రొఫెషనల్స్ అమెరికాలో చట్టబద్ధంగా నివసించే మార్గాలు మూసుకుపోతున్నాయి. దీనికి తోడు స్థానిక అమెరికన్ల నుంచి వ్యతిరేకత కూడా రోజురోజుకూ పెరుగుతోందట.

ఉద్యోగాలు కోల్పోయిన ఇండియన్స్ అమెరికాలో అద్దెలు చెల్లించలేక అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు మిలియన్ డాలర్లు సంపాదించిన టెక్కీలు సైతం ఇప్పుడు నెలవారీ రెంట్స్ కట్టలేక లీజులను మధ్యలోనే వదిలేస్తున్నారట. కార్లను అమ్ముకోలేక స్క్రాప్‌యార్డ్‌లలో పడేస్తున్నారు. విలువైన వస్తువులను వదిలేసి రాత్రికి రాత్రే భారత్‌కు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఇక వడ్డీ రేట్లు 4 శాతం నుంచి 7.5 శాతానికి పెరగటంతో హోమ్ లోన్స్ తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఇళ్లు అమ్ముడుపోక, భారీ ఈఎంఐలు, విపరీతమైన ద్రవ్యోల్బణం కారణంగా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. నిన్నమెున్నటి వరకూ కోటి రూపాయలకు పైగా ప్యాకేజీ అందుకున్న టెక్కీలు సైతం ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.35 లక్షల జీతానికైనా పనిచేస్తాం అంటూ జాబ్స్ వెతుక్కుంటున్నారు.

ఇక అమెరికాలోని తెలుగు విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వేలాది డాలర్లు ఫీజులు చెల్లించి చదువు పూర్తి చేసినా క్యాంపస్ ప్లేస్‌మెంట్లు లభించకపోవడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చేసిన అప్పులు తీర్చడానికి, రోజువారీ ఖర్చుల కోసం పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, డెలివరీ బాయ్‌లుగా దొరికిన ఏ చిన్న పనైనా చేస్తూ కష్టపడుతున్నారు. 

ALSO READ : 3 నెలల్లో 14 లక్షల మందికి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చిన బ్యాంక్..

ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న ఈ పరిస్థితులు 2008 నాటి ఆర్థిక మాంద్యాన్ని తలపిస్తున్నాయని అక్కడ నివసిస్తున్న భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాలర్ కలలతో అమెరికా వెళ్లిన ఎంతోమంది తిరిగి సొంతూళ్లకు ఉత్తి చేతులతో తిరిగి వస్తుండటంతో అక్కడికి వెళ్లాలని అనుకుంటూ కలలు కంటున్న వాళ్లలో భయం స్టార్ట్ అయ్యింది.