పోలవరం దగ్గర గోదావరి జలాల రంగులో మార్పు.. వరద సమయంలో రాగి వర్ణం.. ఇప్పుడు నీలి రంగులో..

పోలవరం దగ్గర గోదావరి జలాల రంగులో మార్పు.. వరద సమయంలో రాగి వర్ణం.. ఇప్పుడు నీలి రంగులో..

పోలవరం దగ్గర గోదావరి జలాల రంగు మారింది... వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు రాగి వర్ణంలో ఉండగా.. ఇప్పుడు వరద ఉదృతి తగ్గాక నీలి రంగులోకి మారాయి. జులై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు ఎరుపు, గోధుమ రంగులో ఉన్న నీరు అక్టోబర్ రెండో వారానికి నీలి రంగులోకి మారాయి.

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగి.. కొండలు, వాగుల నుంచి వచ్చిన నీటితో పాటు మట్టి, ఇసుక రేణువులు నదిలోకి చేరాయి. దీంతో పోలవరం దగ్గర నీరు రాగి రంగులో కనిపించింది. వర్షాలు తగ్గి వరద ఉదృతి తగ్గాక నదిలోకి మట్టి చేరడం తగ్గింది. ఈ క్రమంలో నీరు నీలి రంగులోకి మారింది. 

తగ్గిన వరద ఉద్ధృతి

అక్టోబర్ రెండో వారం నాటికి గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది... ప్రస్తుతం నీటిలో మట్టి కణాల పరిమాణం తగ్గడంతో నదీజలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శీలేరు నుంచి గోదావరిలోకి చేరుతున్న నీరు కూడా నీలి రంగులో ఉండటంతో పోలవరం దగ్గర ఈ మార్పు కనిపిస్తోంది. వర్షాకాలంలో వరద నీటితో నిండుగా కనిపించిన గోదావరి.. ప్రస్తుతం సాధారణ ప్రవాహ పరిస్థితుల్లో కొనసాగుతోంది. పోలవరం స్పిల్‌వే దగ్గర నదీజలాల రంగులో వచ్చిన మార్పు కాలానుగుణంగా మారుతున్న ప్రవాహ పరిస్థితులను ప్రతిబింబిస్తోంది.