నామినేషన్ ఫైల్ చేయనివ్వాలని SI, RDO కాళ్లు పట్టుకున్న వైసీపీ అభ్యర్థులు !

నామినేషన్ ఫైల్ చేయనివ్వాలని SI, RDO కాళ్లు పట్టుకున్న వైసీపీ అభ్యర్థులు !

గుత్తి/దర్శి: నామినేషన్ ఫైల్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని గుత్తి వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి రంగస్వామి SI కాళ్లు పట్టుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసులు ముందే వైసీపీ నేతలను బెదిరిస్తూ, నామినేషన్ వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డంగా నిలవడంతో గొడవ జరిగింది.

ఈ క్రమంలోనే.. వైసీపీ అభ్యర్థి పోలీసుల కాళ్లు పట్టుకున్నాడు. దర్శిలో నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ అభ్యర్థులు RDO కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న ఘటన కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో మొత్తం 17 కార్పొరేషన్లు ఉండగా ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు మేయర్, బీసీలకు ఐదు మేయర్ పదవులను ప్రభుత్వం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. జనరల్ మహిళలకు ఐదు మేయర్ పదవులను కేటాయించగా.. నాలుగు కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్‌‌‌‌‌‌‌‌రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించింది.

మంగళగిరి -తాడేపల్లి మేయర్ పదవిని ఎస్టీ జనరల్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం కేటాయించింది. కర్నూలు మేయర్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసింది. రాజమహేంద్రవరం మేయర్ పదవి ఎస్సీ జనరల్‌‌‌‌‌‌‌‌కు కేటాయించగా... కాకినాడ, మచిలీపట్నం మేయర్ పదవులు బీసీ మహిళలకు రిజర్వ్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏలూరు, అనంతపురం, చిత్తూరు మేయర్ పదవులను బీసీ జనరల్‌‌‌‌‌‌‌‌కు కేటాయించింది.

విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు జీవీఎంసీ మేయర్ పదవులను జనరల్ మహిళలకు సర్కార్ రిజర్వ్ చేసింది. తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ పదవులు అన్‌‌‌‌‌‌‌‌రిజర్వ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రకటించింది. ఏపీలో మొత్తం 132 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందులో  బీసీ 36, ఎస్సీ 14, ఎస్టీ 3, జనరల్ మహిళ 27, జనరల్ 26, అన్ రిజర్వ్డ్ 26 కేటాయించారు.