హైదరాబాద్, వెలుగు: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా అమెజాన్ బజార్ విభాగంలో నవరాత్రి పండుగ ఆఫర్లు మొదలయ్యాయి. అమెజాన్ మొబైల్ యాప్లో మాత్రమే కనిపించే బజార్ విభాగంలో బ్యూటీ, ఫ్యాషన్, హోమ్, ఎలక్ట్రానిక్స్పై 70 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. మూడు కోట్లపైగా ఉత్పత్తులు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
పండుగ దుస్తులు, సాంప్రదాయ ఆభరణాలు, చెప్పులు, ఇంటి అలంకరణ వస్తువులను అతి తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఇస్తున్నారు. కొత్త కస్టమర్లకు మొదటి ఆర్డర్ పై రూ.150 వరకు 35 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
