బుమ్రా ఇన్.. ఐదుగురు ఔట్! న్యూజిలాండ్ సిరీస్‌కు భారత టెస్ట్ జట్టులో భారీ మార్పులు

బుమ్రా ఇన్.. ఐదుగురు ఔట్! న్యూజిలాండ్ సిరీస్‌కు భారత టెస్ట్ జట్టులో భారీ మార్పులు

Jasprit Bumrah: న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా నవంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జాతీయ ఎంపిక కమిటీ బీసీసీఐ ద్వారా 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గత ఆగస్టులో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పోలిస్తే, ఈ పర్యటన కోసం టీమిండియాలో ఏకంగా 5 కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పునరాగమనం, మోకాలి గాయం కారణంగా లంక సిరీస్‌కు దూరమైన బుమ్రా, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి కివీస్ గడ్డపై భారత పేస్ దళానికి నాయకత్వం వహించబోతున్నాడు. 

బౌలింగ్ విభాగంలో కీలక మార్పులు: 

* న్యూజిలాండ్ వేగవంతమైన పిచ్‌లను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు ఐదుగురు ఫాస్ట్ బౌలర్లకు జట్టులో చోటు కల్పించగా, ముగ్గురు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశారు.

* ఆకాశ్ దీప్ రీ-ఎంట్రీ: వెన్ను గాయం కారణంగా దాదాపు ఏడాది కాలంగా టెస్టులకు దూరంగా ఉన్న ఆకాశ్ దీప్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు.

* అన్షుల్ కంబోజ్ కమ్‌బ్యాక్: ఇంగ్లాండ్‌పై మాంచెస్టర్ టెస్టులో ఆడిన తర్వాత జట్టుకు దూరమైన అన్షుల్ కంబోజ్ మళ్లీ సెలెక్టర్ల పిలుపునందుకున్నాడు.

* సాయి సుదర్శన్, సుందర్ రీ-ఎంట్రీ: గాయాల కారణంగా శ్రీలంక టూర్ కు దూరమైన సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌లు తిరిగి తుది జట్టు రేసులోకి వచ్చారు.

జట్టు నుంచి వైదొలిగిన ఐదుగురు ఆటగాళ్లు: 

* శ్రీలంక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ మానవ్ సుతార్ కు కివీస్ కండిషన్స్ దృష్ట్యా చోటు దక్కలేదు. అలాగే సర్ఫరాజ్ ఖాన్, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలను ఈ పర్యటనకు పక్కనపెట్టారు.

* ఇన్ (In): జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్.

* ఔట్ (Out): మానవ్ సుతార్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, సర్ఫరాజ్ ఖాన్, సారాంశ్ జైన్.

భారత టెస్టు జట్టు (India Test Squad): 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్ (ఫిట్‌నెస్‌కు లోబడి), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అన్షుల్ కంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ (ఫిట్‌నెస్‌కు లోబడి), ఆకాశ్ దీప్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.