ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ ఎవరు? ద్రవిడ్, గిల్‌క్రిస్ట్, మోర్గాన్‌కు నో ఛాన్స్!

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ ఎవరు? ద్రవిడ్, గిల్‌క్రిస్ట్, మోర్గాన్‌కు నో ఛాన్స్!

Mumbai Indians Head Coach: ఐపీఎల్ 2026లో ఎదురైన దారుణ వైఫల్యం (9వ స్థానం) తర్వాత ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), హెడ్ కోచ్ మహేల జయవర్ధనే పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కు తదుపరి ప్రధాన కోచ్‌గా ఎవరు వ్యవహరిస్తారనే అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. 

రేసు నుంచి తప్పుకున్న రాహుల్ ద్రవిడ్: 

* టీమిండియాను 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిపిన రాహుల్ ద్రవిడ్ ముంబై ఇండియన్స్ కోచ్ రేసులో ఉన్నారనే ప్రచారాన్ని ప్రముఖ క్రికెట్ మీడియా సంస్థ క్రిక్‌బజ్ (Cricbuzz) ఖండించింది. 

* కుటుంబానికి ప్రాధాన్యం: ద్రవిడ్ ప్రస్తుతం తన కుటుంబానికి, ప్రత్యేకించి తన కుమారులు (సమిత్, అన్వయ్) క్రికెట్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని చూస్తున్నారు.

* 2026 సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రవిడ్‌కు ఐపీఎల్ లీగ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ, ఆయన ఐపీఎల్ 2027 సీజన్‌లో కోచింగ్ బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తిగా లేరని స్పష్టమైంది.

* ఇదే బాటలో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా తాము అందుబాటులో లేమని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెగేసి చెప్పారు.

ముంబై ఇండియన్స్ కోచ్ రేసులో ఉన్నది వీళ్లే: 

* మైఖేల్ హస్సీ (Mike Hussey): చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న హస్సీ, ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతున్నారు. ఆయన ముంబై ఇండియన్స్ రేసులో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది.

* ఆడ్రియన్ బిరెల్ (Adrian Birrell): సౌతాఫ్రికాకు చెందిన ఈ సీనియర్ కోచ్‌ ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్‌లో హాట్ కేక్‌లుగా మారారు. SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఏకంగా 3 టైటిళ్లు, 4 ఫైనల్స్ అందించారు.

* ఆరోన్ ఫించ్ (Aaron Finch): ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా కొన్ని ఐపీఎల్ జట్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 

కొత్త కోచ్ నిర్ణయంపైనే సపోర్ట్ స్టాఫ్ భవితవ్యం: 

* ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ నూతన హెడ్ కోచ్ ఎంపిక కోసం త్వరలోనే ఇంటర్వ్యూలు ప్రారంభించనుంది.

* కొత్తగా వచ్చే హెడ్ కోచ్‌కే ప్రస్తుత సపోర్ట్ స్టాఫ్ అయిన లసిత్ మలింగ, పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్‌లు), కీరన్ పొలార్డ్ (బ్యాటింగ్ కోచ్), కార్ల్ హాప్‌కిన్సన్ (ఫీల్డింగ్ కోచ్)లను కొనసాగించాలా వద్దా అనే నిర్ణయాధికారాన్ని ఫ్రాంచైజీ వదిలేసింది.