హైదరాబాద్: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. 2026 నవంబర్‌లో ఈ లవ్ బర్డ్స్ వివాహబంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి విదేశాల్లో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతానికి పెళ్లి తేదీని అఫిషియల్‌గా అనౌన్స్ చేయనప్పటికీ రిసెప్షన్ డేట్ మాత్రం తెలిసింది.
నవంబర్ 21న చెన్నైలోని ఓ హోటల్లో కావ్య, అనిరుధ్ల రిసెప్షన్ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ క్రమంలోనే తమ కుమార్తె రిసెప్షన్ వేడుకకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని కావ్య మారన్ పేరెంట్స్, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు ఆహ్వానించారు.
శుక్రవారం (అక్టోబర్ 16) హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన కళానిధి మారన్ దంపతులు.. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న తన కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు రావాలని ఇన్వైట్ చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు సీఎం రేవంత్ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ప్రచారానికి ఎండ్ కార్డ్:
కావ్య మారన్, అనిరుధ్ల పెళ్లి విషయం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, పెళ్లి వార్తలను కావ్య మారన్ గానీ అనిరుధ్ గానీ ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. దీంతో వీరి పెళ్లి టాపిక్‌పై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది.
►ALSO READ | Nagarjuna: 'ఇట్లు అర్జున'కు నాగార్జున అండ.. చిరంజీవితో మల్టీస్టారర్‌పై కింగ్ క్రేజీ కామెంట్స్!
ఈ క్రమంలో కావ్య పేరెంట్స్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నవంబర్ 21న చెన్నైలో జరగనున్న తమ కుమార్తె కావ్య, అనిరుధ్ల రిసెప్షన్ వేడుకకు రావాలని ఆహ్వానించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫిషియల్‌గా కన్ఫార్మ్ అయ్యింది. దీంతో కావ్య, అనిరుధ్ ల పెళ్లికి సంబంధించిన రూమర్లకు తెరపడింది. మరోవైపు.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కావ్య, అనిరుధ్‌లకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వై దిస్ కొలవెరి డీ సాంగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్.. అనంతరం తమిళ, హిందీ సినిమాల్లో అనేక హిట్ పాటలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జైలర్, జెర్సీ, జవాన్, లియో లాంటి పలు చిత్రాలకు ఆయన అందించిన సంగీతం చాలా మంచి ఆదరణ పొందింది. కావ్య.. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె.. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో గ్రౌండ్ లో తనదైన స్టైల్ లో హావభావాలతో పాపులర్ అయింది. కళానిధి మారన్ నిర్మించిన జైలర్, బీస్ట్, రాయన్ వంటి సినిమాలకు అనిరుధ్ సంగీతం అందించారు.
