IPL 2026 ఎఫెక్ట్.. మహేల జయవర్ధనేను ఇంటికి పంపిన ముంబై జట్టు.. కొత్త కోచ్ కోసం వేట 

IPL 2026 ఎఫెక్ట్.. మహేల జయవర్ధనేను ఇంటికి పంపిన ముంబై జట్టు.. కొత్త కోచ్ కోసం వేట 

Mahela Jayawardene: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ మహేల జయవర్ధనే (Mahela Jayawardene) తో పరస్పర అంగీకారంతో తమ అనుబంధాన్ని తెంచుకుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, రాబోయే సీజన్ సన్నాహకాల్లో భాగంగా హెడ్ కోచ్ పదవి నుంచి జయవర్ధనేను తొలగించి, కొత్త కోచ్ కోసం వేట స్టార్ట్ చేసింది. 

ఐపీఎల్ 2026 డిజాస్టర్ సీజన్ ప్రభావమే: 

* కేవలం 4 విజయాలు: ముంబై ఇండియన్స్ 2026 సీజన్‌లో ఆడిన మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది ముంబై. 

* కారణాలు: కీలక ఆటగాళ్లకు గాయాలు, ప్లేయర్ల అందుబాటులో ఉండటంపై సమస్యలు, డ్రెస్సింగ్ రూమ్‌లో ఏర్పడిన విభేదాలు (Dressing-room unrest) జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ జట్టు శైలిని పూర్తిగా మార్చాలని చూసింది, ఈ క్రమంలో జయవర్ధనేను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించింది. రాబోయే వారంలో కొత్త హెడ్ కోచ్ కోసం పలువురు దిగ్గజాలను ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తుంది. 

3 ఐపీఎల్ టైటిళ్లు అందించిన మహేల: 

* శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కోచ్‌గా నిలిచాడు. 

* చారిత్రక విజయాలు: 2017లో తొలిసారిగా ముంబై హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జయవర్ధనే.. 2017, 2019, 2020 లలో ముంబై ఇండియన్స్‌కు 3 ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు.

* గ్లోబల్ హెడ్ రోల్: 2022 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మన్స్ గా ప్రపంచవ్యాప్తంగా ముంబై ఫ్రాంచైజీ జట్లకు దిశానిర్దేశం చేశాడు.

* కమ్‌బ్యాక్: తిరిగి 2024లో రెండు ప్లస్ ఒకేడాది (2+1) కాంట్రాక్ట్‌తో హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి 2025లో జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. అయితే 2026లో ఎదురైన ఘోర పరాజయం ఈ సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికింది.

జయవర్ధనే, నీతా అంబానీ ఎమోషనల్ పోస్ట్: 

* మహేల జయవర్ధనే రియాక్షన్: దశాబ్ద కాలానికి పైగా ముంబై ఇండియన్స్‌తో కొనసాగిన ప్రయాణం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది.. అద్భుతమైన ఆటగాళ్ళు, కోచింగ్ స్టాఫ్, అభిమానుల మద్దతును ఎప్పటికీ మరిచిపోలేను.. నాపై నమ్మకం ఉంచిన నీతా అంబానీ, ఆకాశ్ అంబానీలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అని మహేల ఎమోషనల్ అయ్యాడు. 

* నీతా అంబానీ ప్రశంసలు: ముంబై ఇండియన్స్ జట్టు విజయాల్లో మహేల జయవర్దనే పాత్ర మరవరలేనిది. అతని సొంత స్వభావం, క్రీడాస్ఫూర్తి జట్టుకు ఎంతో ఉపకరించాయి. జయవర్ధనే ఎల్లప్పుడూ మా #OneFamily లో భాగమేనని ముంబై ఇండియన్స్ అధినేత్రి నీతా అంబానీ రాసుకొచ్చింది.