ఒకే జట్టులో అబ్బాయిలు, అమ్మాయిలు..శ్రీలంకలో మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండర్‌‌‌‌‌‌‌‌‌‌

ఒకే జట్టులో అబ్బాయిలు, అమ్మాయిలు..శ్రీలంకలో మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండర్‌‌‌‌‌‌‌‌‌‌

కొలంబో: క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలో తొలిసారి మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి) క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీని నిర్వహించనున్నారు. కొలంబోలోని సింహళీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా వచ్చే నెల 14 నుంచి 29 వరకు పోటీలు జరగనున్నాయి. 80 ఓవర్ల ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో (టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–20) సాగే ఈ టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 13 నుంచి 21 సంవత్సరాల వయసున్న 160 మంది యువ క్రికెటర్లు పాల్గొననున్నారు.

ప్రతి జట్టులో 20 మంది అమ్మాయిలు, 20 మంది అబ్బాయిలతో కూడిన మొత్తం 40 మంది సభ్యుల జట్టు ఉంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే జట్టు తరఫున ఆడి, వారి మొత్తం పరుగుల స్కోరే ఫలితాన్ని నిర్ణయిస్తుంది.  ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో రెడ్, వైట్ బాల్ ఉపయోగిస్తారు.  ప్రతి జట్టు రెండు సార్లు బ్యాటింగ్ చేస్తుంది. ఉదయం రెడ్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మొదటి 40 ఓవర్లు ఆడతారు. ఫ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైట్ల వెలుతురులో  వైట్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మిగతా 40 ఓవర్లు కొనసాగుతాయి. తొలి ఇన్నింగ్స్ స్కోర్లు రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొనసాగుతాయి. 'పారిటీ రూల్ (బాల, బాలికలకు సమాన అవకాశం)' ప్రకారం అమ్మాయిల స్కోర్లు అబ్బాయిల విజయాలను ప్రభావితం చేస్తాయి.