ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరుపై నిరసన తెలుపుతూ కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన 'లెహ్రా దో తిరంగా' మార్చ్ దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. ఈ మార్చ్‌కు ముందుగానే తను అరెస్టయ్యే అవకాశం ఉందని అభిజిత్ దీప్కే అంచనా నిజమైంది. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పోలీసులు ఝండేవాలాన్లోని ఆయన బస చేస్తున్న నివాసానికి చేరుకుని, మార్చ్‌లో పాల్గొనవద్దంటూ నోటీసులు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు దీప్కేకు గృహనిర్బంధం చేశారు.
ఢిల్లీ పోలీసు చట్టంలోని సెక్షన్ 29 కింద దీప్కేకు నోటీసులు అందజేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు ఈ అధికారం ఉంటుంది. ఈ పరిణామాల మధ్య దీప్కే తన భుజాలపై త్రివర్ణ పతాకాన్ని కప్పుకుని మౌనపోరాటం రూపంలో నిరసన తెలిపారు. అంతకుముందు రోజు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండాతో సమావేశం కావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి లేకపోవడంతో CJP నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలు ఇటీవలే అరెస్టై జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లారు.
దీంతో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతం పూర్తిగా పోలీసు బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 6వేల మంది పోలీసులు, బలగాలను భారీగా మోహరించారు. సెంట్రల్ పార్క్ చుట్టూ ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. అంతేకాకుండా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆ పార్క్‌ను రెండు రోజుల పాటు మూసివేసింది. CJP మార్చ్‌కు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు.. కేవలం 11 మంది మాత్రమే త్రివర్ణ పతాకంతో జాతీయ గీతం ఆలపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ALSO READ : సీజేపీ తిరంగా మార్చ్ పై.. తక్షణ ఉత్వర్వులకు సుప్రీంకోర్టు నిరాకరణ
జాతీయ జెండాను ఎగరవేయడం నేరమా అంటూ ప్రభుత్వ తీరును దీప్కే ప్రశ్నించారు. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తూ.. తాము జెండా పట్టుకోవడానికి వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. అక్టోబర్ 10న కూడా విమానాశ్రయంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాలో పరిస్థితులు హాట్ హాట్ గా మారాయి. ఇదే క్రమంలో తన కదలికలను నంబర్ ప్లేట్లు లేని వాహనాలు వెంబడిస్తున్నాయని రక్షణపై డీప్కే ఆందోళన వ్యక్తం చేశారు తాజాగా.
