16 ఏళ్ల పిల్లోడు.. స్కూల్ లో ముగ్గురు పిల్లలని తుపాకీతో కాల్చి చంపేశాడు

16 ఏళ్ల పిల్లోడు.. స్కూల్ లో ముగ్గురు పిల్లలని తుపాకీతో కాల్చి చంపేశాడు

అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం బెండ్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో గురువారం(15 అక్టోబర్) జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. చివరికి కాల్పులకు పాల్పడిన అనుమానితుడు కూడా మృతి చెందాడు. 

 సమాచారం ప్రకారం..  గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు  ముందు ఓ వ్యక్తి కారుపై కాల్పులు జరుపుతున్నాడంటూ పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అతడు స్కూలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు 911కి సమాచారం అందింది.  

సమాచారం అందుకున్న వెంటనే  పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకోగా.. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతి చెందినట్లు గుర్తించారు. అయితే, అతడిని ఎవరైనా కాల్చి చంపారా లేదా.. అనే విషయం స్పష్టంగా తెలియలేదని షీలా మిల్లర్ తెలిపారు.  
 
కాల్పులకు పాల్పడిన వ్యక్తి 16 ఏళ్ల టీనేజర్ అని,  అనుమానితుడి పేరు, ఇతర వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. 

ALSO READ  : తాత వయసున్న వ్యక్తితో 30 ఏళ్ల యువతి ప్రేమ..

కాల్పుల ఘటన తర్వాత సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూలుని  పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై బెండ్-లా పైన్ స్కూల్ సూపరింటెండెంట్తీ  విచారం వ్యక్తం చేశారు. ఈ స్కూల్లో కిండర్ గార్టెన్ నుండి ఐదవ తరగతి వరకు,  సుమారుగా 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు చదువుకుంటారు. ఇందులో సుమారు 450 మంది విద్యార్థులు, 40 మంది సిబ్బంది ఉన్నారు.