మాజీ ఎంపీ, అమరరాజా గ్రూప్ సీఎండీ గల్లా జయదేవ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు మంత్రి లోకేష్. ఆదివారం ( నవంబర్ 29 ) తిరుపతి జిల్లా కారకంబాడిలోని అమరరాజా ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు సిద్దార్థ్, హైన్ కిమ్ లను ఆశీర్వదించారు లోకేష్.
నూతన వధూవరులకు పుష్పగుచ్చం అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. అంతకుముందు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రి లోకేష్ కు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
గల్లా జయదేవ్, పద్మావతి దంపతుల రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్లా నవంబర్ 25న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా తాను ప్రేమిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన యువతి హైన్ కిమ్ నుపెళ్లి చేసుకున్నారు సిద్దార్థ్ గల్లా. వియత్నాంలోని ఐలాండ్ లో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సిద్దార్థ్, హైన్ కిమ్ ల డెస్టినేషన్ వెడ్డింగ్ వైభవంగా జరిగింది.మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాల సంస్క్రుతుల ప్రకారం హిందూ, కొరియన్, పాశ్చాత్య సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది.
