నల్గొండ జిల్లాలో గుళ్ళలో భక్తుల పుస్తెలతాళ్లు ఎత్తుకెళ్తున్న ముఠా అరెస్ట్..!

నల్గొండ జిల్లాలో గుళ్ళలో భక్తుల పుస్తెలతాళ్లు ఎత్తుకెళ్తున్న ముఠా అరెస్ట్..!

నల్గొండ జిల్లాలో రద్దీగా ఉండే దేవాలయాలే టార్గెట్ గా భక్తుల బంగారు పుస్తెలతాళ్లు ఎత్తుకెళ్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. తమిళనాడుకు చెందిన ఈ అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ద్దీగా ఉండే ప్రముఖ దేవాలయాలే టార్గెట్‌గా ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు పోలీసులు.

తమిళనాడుకు చెందిన ఈ ముఠాలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఐదు రోజుల్లోనే రెండు చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించారు నల్లగొండ పోలీసులు. నిందితులు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాల్లో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. నిందితుల నుంచి రూ.20 లక్షల విలువైన స్కార్పియో వాహనం, రెండు బంగారు పుస్తెలతాళ్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

ALSO READ : ఘట్‌కేసర్‌లో భారీ ట్రాఫిక్‌ జామ్‌.. హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు

ఈ కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి, నల్లగొండ టూ టౌన్ ఎస్‌ఐ సైదా బాబు, సీసీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి పోలీసు సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.