హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL))కి మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన బి.అజిత్ రెడ్డి ఆదివారం( నవంబర్ 29) బాధ్యతలు చేపట్టారు. బేగంపేట్ మెట్రో రైల్ భవన్ లో అజిత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హెచ్ఎంఆర్ఎల్ అదనపు ఎండీ గా ఉన్నఅజిత్ రెడ్డిని ఎండీ గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అజిత్ రెడ్డి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐడీఈఎస్ అధికారి అయిన అజిత్ రెడ్డి గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడానికి మెట్రో రైల్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా అజిత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థను విస్తరణకు పటిష్టమైన చర్యలు చేపడతానని తెలిపారు.
