బావిలో నీటిపై తేలుతూ వరల్డ్ మ్యాప్ గీశాడు... ప్రపంచ రికార్డ్ కోసం రిటైర్డ్ టీచర్ సాహసం..!

బావిలో నీటిపై తేలుతూ వరల్డ్ మ్యాప్ గీశాడు... ప్రపంచ రికార్డ్ కోసం రిటైర్డ్ టీచర్ సాహసం..!

మహబూబాబాద్ జిల్లాలో ఓ రిటైర్డ్ టీచర్ ప్రపంచ రికార్డ్ కోసం సాహసం చేశాడు. బావిలో నీటిపై తేలుతూ ప్రపంచ పఠాన్ని చిత్రించాడు. రిటైర్ అయ్యి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ శేషజీవితం గడపాల్సిన వయసులో వరల్డ్ రికార్డ్ కోసం సాహసం చేసిన ఆ టీచర్ ఎవరో ఇప్పుడు చూద్దాం... మహబూబాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ టీచర్ చింతకుంట్ల కుమారస్వామి ప్రపంచ రికార్డ్ కోసం సాహసం చేశాడు. బావిలో నీటిపై తేలుతూ కేవలం 5 నిమిషాల 24సెకన్లలోనే వరల్డ్ మ్యాప్ చిత్రించాడు. 

మహబూబాబాద్‌లోని డిగ్రీ కళాశాల ఆవరణలో మ్రీల్ర్టీ బావిలో నీటిపై తేలుతూ ప్రపంచ పటాన్ని చిత్రించిన చింతకుంట్ల కుమారస్వామి. కేవలం 5 నిమిషాల 24 సెకన్లలో ప్రపంచ పటాన్ని చిత్రీకరించాడు కుమారస్వామి. నీటిపై తేలుతూ ప్రపంచ పటంలో ఏడు ఖండాలు, ఐదు మహాసముద్రాలను చిత్రించి ప్రపంచ రికార్డ్ కోసం సాహసం చేశాడు కుమారస్వామి.

 64 ఏళ్ల వయసులో 45 రోజుల పాటు కృషి చేసి ఈ అరుదైన సాహసం చేశాడు కుమారస్వామి. గతంలో తెలంగాణ, భారతదేశ చిత్రపటాలను గీసి రికార్డులు సృష్టించాడు కుమారస్వామి. ఈ క్రమంలో కుమారస్వామి ప్రతిభను అభినందించారు ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, మున్సిపల్ చైర్మన్ జ్యోతి, జేఏసీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ.

కుమారస్వామిని ఘనంగా సన్మానించారు కాళోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, తోటి రిటైర్డ్ ఉపాధ్యాయులు. నీటిపై తేలుతూ ప్రపంచ పటాన్ని చిత్రించిన కుమారస్వామి ప్రయత్నం వరల్డ్ రికార్డుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు మహబూబాబాద్ జిల్లా ప్రజలు.