హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా.. టెన్త్ అర్హతతో 60కి పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు..

 హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా.. టెన్త్ అర్హతతో 60కి పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు..

హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. నగరంలోని నాంపల్లిలో డిసెంబర్ 2వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో 60కి పైగా కంపెనీలు పాల్గొని ఉద్యోగులను ఎంపిక చేయనున్నాయి. పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన వారు ఈ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. ఫ్రెషర్లు మాత్రమే కాకుండా, ఇప్పటికే ఉద్యోగ అనుభవం ఉన్నవారు కూడా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

ముఖ్యంగా ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ మెగా జాబ్ మేళాను డిసెంబర్ 2, బుధవారం నాడు హైదరాబాద్‌లోని నాంపల్లిలో నిర్వహించనున్నారు.

తేదీ: డిసెంబర్ 2, 2026
సమయం: ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
అడ్రస్: రెడ్ రోజ్ ప్యాలెస్, నాంపల్లి, హైదరాబాద్ 
సమీప ప్రాంతం: పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా, అసెంబ్లీ మెట్రో స్టేషన్ సమీపంలో.

60కి పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు
ఈ జాబ్ మేళాలో 60కి పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు సమాచారం. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా ఐటీ (IT) రంగంతో పాటు ఐటీకి సంబంధం లేని ఇతర రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగులకు ఎంపిక చేయనున్నాయి.

పదో తరగతి పాసైనా అర్హులే
ఈ జాబ్ మేళా ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం డిగ్రీ లేదా పీజీ చదివిన వారికే కాకుండా పదో తరగతి పూర్తి చేసిన వారు కూడా పాల్గొనవచ్చు.

కింది విద్యార్హతలు ఉన్నవారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
*పదో తరగతి (10th)
*ఇంటర్మీడియట్ (Intermediate)
*డిగ్రీ (Degree)
*పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG)
అలాగే ఏ సంవత్సరంలో చదువు పూర్తి చేశారనే నిబంధన కూడా లేదని సమాచారం. ఫ్రెషర్లు, అనుభవం ఉన్న ఉద్యోగార్థులు ఇద్దరికీ అవకాశం ఉంటుంది.

తెలంగాణలోని వారే కాదు.. ఇతర రాష్ట్రాల వారికీ అవకాశం
ఈ జాబ్ మేళాకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగ యువత హాజరుకావచ్చు. అంతేకాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగార్థులు కూడా ఇంటర్వ్యూలకు రావచ్చు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు రావాలనుకునే వారికి కూడా ఇదొక మంచి అవకాశం.

ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా నిర్ణీత తేదీన, నిర్ణీత సమయంలో రెడ్ రోజ్ ప్యాలెస్‌కు వెళ్లి ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ఫోన్ నంబర్‌ 8374315052 సంప్రదించవచ్చు.

కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, అప్‌డేట్ చేసిన రెజ్యూమ్‌తో పాటు అవసరమైన డాకుమెంట్స్ తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైతే అక్కడికక్కడే ఉద్యోగ నియామక పత్రాలు పొందే అవకాశం ఉంటుంది.