జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అద్భుతమైన నవంబర్ 29 వ తేదీ ఆదివారం రెండు యోగాలు ఏర్పడుతాయి. గ్రహాల సంచారం ఆధారంగా సర్వార్థసిద్దియోగం.. రవిపుష్య యోగం ఏర్పడనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ శుభ యోగాల ప్రభావంతో నాలుగు రాశుల వారికి(వృషభం, ధనస్సు, తుల, మీన) మహర్ధశ పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .
సర్వార్థ సిద్ధి యోగం & రవి పుష్య యోగం : నవంబర్ 29 ఉదయం 06:53 గంటలకు రవి పుష్య యోగం: ఉదయం 10:59 ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం వలన ప్రారంభించే ఏ పని అయినా విజయాయం కలుగుతుంది. రవిపుష్యయోగం దోషాలను తొలగించి శుభ ఫలితాలను కలుగజేస్తుంది.
వృషభ రాశి : ఈ రాశి వారికి సర్వార్థసిద్ది యోగం చాలా శుభప్రదమైనది. ఈ సమయంలో ఈ రాశి వారు బాగా ప్రయోజనాలను పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటే ఆదాయంగా మారతాయి. గతంలో నిలిచిపోయిన అనేక పనులు మళ్లీ ఊపందుకుంటాయి. కెరీర్ విషయంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. . ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది.మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు మానసికంగా కూడా స్థిరంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది.
ధనుస్సు రాశి : ఈ రాశి వారికి 2026 నవంబర్ 29న ఏర్పడే మంచి ఫలితాలను ఇస్తాయి. రెండు అద్భుతమైన యోగాల ప్రభావంతో ఈ రాశి వారికి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కొత్త ప్రాజెక్టు లేదా ఒప్పందాన్ని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయమని పండితులు చెబుతున్నారు.
తులా రాశి: ఈ రాశి వారికి రెండు గ్రహాల కారణంగా ఏర్పడే రెండు యోగాల యోగం భారీగా ప్రయోజనాలను తీసుకొస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంది. డబ్బు పరంగా అభివృద్ది ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.చేతి వృత్తుల వారికి అనుకోని లాభాలు వస్తాయి. పూర్వీకుల ఆస్థి చేతికి రావడంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడటం ప్రారంభిస్తుంది.ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి
మీన రాశి: సర్వార్ధసిద్దియోగం మరియు రవి పుష్య యోగం వలన ఈ రాశి వారికిఈ రాశి వారికి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాల్లో మంచి మార్పు కనిపిస్తుంది.చాలా మందికి కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అనేక అవకాశాలు ఉంటాయి.వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, కొత్త బాధ్యతలను తీసుకునే అవకాశం ఉంది. వృత్తిపరంగా మీ ఇమేజ్ పెరుగుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
