డీలిమిటేషన్...కొన్నేళ్లుగా దేశరాజకీయాల్లోను ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. డీలిమిటేషన్ అమల్లోకి వస్తే.. లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు కూడా గణనీయంగాపెరుగుతాయి. ఈ అంశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. లోక్ సభ తో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ల తో పాటుగా డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి.. ఆమోదం దిశగా కసరత్తు చేస్తోంది కేంద్రం.
ఈ బిల్లు ఆమోదంఏపీలో కూడా పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ స్థానాలకు భారీగా పెరుగుతాయి. అయితే.. ఈ బిల్లు 2029 ఎన్నికలకే అమలు అవుతుందా..., అయితే మహిళలకు కేటాయించే సీట్లు ఏమిటి అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. డీలిమిటేషన్ అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రం. నవంబర్ 30న జైరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజెర్వేషన్ బిల్లు కూడా ఆమోదం పొందే విధంగా సన్నాహాలు చేస్తోంది కేంద్రం.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలపై డీలిమిటేషన్ ఎఫెక్ట్:
డీలిమిటేషన్ ప్రభావంతో ఏపీలో శాసనసభ నియోజకవర్గాలు 263కు చేరనున్నాయి.. 2029 ఎన్నికల నుంచే నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కు పెరగనుండగా... లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి.
ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్ సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం మేర పెరగనున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి.
ఈ క్రమంలో 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి... సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి.. 2029 ఎన్నికల్లో అమలు చేసే విధంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
