టెన్త్ పాసైతే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

టెన్త్ పాసైతే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిధిలోని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (ఎన్​పీఎల్) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

మొత్తం ఖాళీలు: 25.
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి (మెట్రిక్యులేషన్) లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతను అదనపు అర్హతగా పరిగణిస్తారు.
వయసు:2026, డిసెంబర్ 23 నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల కంటే తక్కువ కాకుండా 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: డిసెంబర్ 23. 
పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్ఐఆర్- నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ, డాక్టర్ కె.ఎస్. కృష్ణన్ మార్గ్, న్యూఢిల్లీ - 110012 చిరునామాకు పంపాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రూట్నీ, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.nplindia.in ను సందర్శించండి.

రాత పరీక్ష

ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు 75 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 75 మార్కులకు, జనరల్ అవేర్​నెస్ నుంచి 50 ప్రశ్నలు 150 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. 
– వెలుగు, ఎడ్యుకేషన్