తమిళనాడులో 15 రోజులు పితృత్వ సెలవులు..

తమిళనాడులో 15 రోజులు పితృత్వ సెలవులు..

చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ఆ రాష్ట్ర ప్రభుత్వ పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు మంజూరు చేస్తున్నట్లు 2026 నవంబర్ 26 ( గురువారం ) ప్రకటించారు. వివాహితులైన పురుష ప్రభుత్వ ఉద్యోగులు తమ భార్య ప్రసవానికి 15 రోజుల ముందు లేదా బిడ్డ పుట్టిన 6 నెలలలోపు ఈ 15 రోజుల సెలవును వినియోగించుకోవచ్చు. 

ఈ సందర్భంగా ప్రసవ సమయంలో తల్లికి, నవజాత శిశువుకు తండ్రి తోడు ఎంతో అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. తల్లికి శారీరక, మానసిక మద్దతు అందించడంతో పాటు శిశువు సంరక్షణలో తండ్రి పాత్ర కీలకమని ప్రభుత్వం తెలిపింది.