కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రానున్నట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 30న కొండగట్టుకు గవర్నర్ వస్తున్నారని చెప్పారు.
అనంతరం సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపైన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూలో, కొండగట్టులో ఏర్పాట్లను పరిశీలించి ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
