వికారాబాద్ ప్రజల సమస్యలు పరిష్కరించాలి ..టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరు

వికారాబాద్ ప్రజల సమస్యలు పరిష్కరించాలి ..టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరు

వికారాబాద్​, వెలుగు : ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా వికారాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి పని చేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ చేపట్టాలని రంగారెడ్డి, -హైద్రాబాద్​, మహబూబ్​నగర్​టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీఅభ్యర్థి ఆకాశ్ కొల్లూరు డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్​లో ఆయన మాట్లాడుతూ కనీస అవసరాలైన తాగునీరు, సాగునీరు, యువతకు ఉపాధి, ప్రతి గ్రామానికి మెరుగైన మౌలిక వసతులు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

 విద్యావంతులైన యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి మారాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

 ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌‌చార్జి డాక్టర్ రఘు, వికారాబాద్ జిల్లా ఇన్‌‌చార్జి దీపక్ రెడ్డి, తాండూరు అసెంబ్లీ ఇన్‌‌చార్జి రాఘవేందర్ రెడ్డి,  జిల్లా బంజారా వింగ్ అధ్యక్షురాలు నానావత్ సునీత బాయి  పాల్గొన్నారు.