రాజ్యాంగ హక్కులు,  స్వేచ్ఛలే ప్రజాస్వామ్యానికి పునాది : వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు 

రాజ్యాంగ హక్కులు,  స్వేచ్ఛలే ప్రజాస్వామ్యానికి పునాది : వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు 

కాశీబుగ్గ, వెలుగు: భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాన్ని కల్పించిందని వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే కోంటేడి శ్రీధర్, రాష్ట్ర బీజేపీ నాయకుడు చింతం సాంబమూర్తి అన్నారు. గురువారం పోచమ్మమైదాన్ నుంచి కాశీబుగ్గలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రదీప్​రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి రాజ్యాంగమే పునాది అని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు, ఆలోచనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాదాసు రాజు, రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.