సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ రమేష్‌ రెడ్డికి జైలు శిక్ష : శిక్షపై వారంపాటు సస్పెన్షన్ విధించిన హైకోర్టు

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ రమేష్‌ రెడ్డికి జైలు శిక్ష : శిక్షపై వారంపాటు సస్పెన్షన్ విధించిన హైకోర్టు

 సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ రమేష్‌ రెడ్డికి జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ భూ వివాదం కేసులో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలన్న కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు గాను కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. 

అదే విధంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి కూడా జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ కేసులో ఇరువురికి రెండువారాల పాటు జైలు శిక్ష,  2 వేల రూపాయల జరిమానా విధించింది. శిక్షపై వారం పాటు సస్పెన్షన్ విధించింది.

ALSO READ : హైదరాబాద్ మరో బెంగళూరు కాకూడదంటే.. ట్రాఫిక్ మార్పులకు వెనకడుగు వేయొద్దు

వారంలోపు ఎలాంటి ఉత్తర్వులు తెచ్చుకోకపోతే హైకోర్టు రిజిస్ట్రార్‌ ముందు లొంగిపోయి శిక్ష అనుభవించాలని హైకోర్టు సూచించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో వారంపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది.