సీఎంసీ హెడ్డాఫీసు నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానం... ఇజ్జత్ నగర్ లో ట్విన్ టవర్స్ నిర్మాణం..

సీఎంసీ హెడ్డాఫీసు నిర్మాణానికి టెండర్లకు ఆహ్వానం... ఇజ్జత్ నగర్ లో ట్విన్ టవర్స్ నిర్మాణం..

సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ హెడ్డాఫీసు నిర్మాణ పనుల కోసం ఈ టెండర్లు ఆహ్వానించింది సీఎంసీ. ఇజ్జత్ నగర్ లో 4.11 ఎకరాల విస్తీర్ణంలో కొత్త సీఎంసీ హెడ్డాఫీసు నిర్మాణం చేపట్టనున్నారు. రూ.169 కోట్ల వ్యయంతో ట్విన్ టవర్స్ నెట్ జీరో గ్రీన్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టనున్నారు. 2 లక్షల 41వేల 540 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు టవర్లు నిర్మించాలని డిసైడ్ చేసింది సీఎంసీ. ఇందులో ఒక టవర్ G+6 అంతస్తులు కాగా, మరో టవర్ G+8 అంతస్తులతో నిర్మించనున్నట్లు వెల్లడించింది.

కొత్త ఆఫీసు సముదాయంలో కౌన్సిల్ హాల్, ప్రజావాణి హాల్ ఏర్పాటు చేయాలని.. ప్రజల కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సహా వివిధ విభాగాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించనున్నారు. సౌర విద్యుత్, ఇంధన పొదుపు వ్యవస్థలతో గ్రీన్ బిల్డింగ్ పద్దతిలో కొత్త బిల్డింగ్ నిర్మించనున్నట్లు తెలిపింది సీఎంసీ. 

ఈ బిల్డింగ్ లో వర్షపు నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో ఆధునిక వసతులతో సీఎంసీ కొత్త ఆఫీసు ఉండనుందని, నెట్ జీరో లక్ష్యంతో పర్యావరణహిత నిర్మాణం ఉండనుందని తెలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ ప్రాంతానికి ఆధునిక పరిపాలనా కేంద్రంగా కొత్త హెడ్ ఆఫీస్ ఉంటుందని తెలుస్తోంది.