చితక్కొట్టుడూ.. ఉతుకుడూ.. అనే పదాలకు సరైన అర్థం అంటే ఇదేనేమో. ఎందుకంటే పరుగుల వీరుడు వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ చేసిన విధానం అలాంటిది. దాదాపు అన్నీ సిక్సులు, ఫోర్లతో డబుస్ సెంచరీ చేయడం ప్రపంచ రికార్డే కదా మరి.
కేవలం 28 బంతులలో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. అదే ఊపుతో 53 బంతులలో డబుల్ సెంచరీ చేసి ప్రపంచాన్ని ఒక్కసారిగా షాకింగ్ కు గురిచేశాడు.
53 బంతులలో 28 సిక్సులు, 7 ఫోర్లతో డబుల్ సెంచరీ చేసిన వైభవ్ వీరబాదుడు చూసి ఆడియన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఒక మ్యాచ్ రెండు ఇన్నిగ్సులలో పడే సిక్సులు ఒక్కడే కొట్టడం ఈ వైభవ్ బ్యాటింగ్ లో చూశారు అభిమానులు.
పరుగుల బుడతడు, టీమిండియా ఏ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా నవంబర్ 24న యూఏఈతో జరిగిన మ్యాచ్ లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. దోహాలో జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.
సూర్యవంశీ తన ఇన్నింగ్స్ లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకోవడం హైలైట్ కాగా.. 28 బంతులలో సెంచరీ చేయడం అతని పరుగుల దాహానికి నిదర్శనం. లిస్ట్ ఏ క్రికెట్ లో 16 బంతులు లేదా అంతకంటే తక్కువ బంతుల్లో రెండుసార్లు హాఫ్ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్ గా కూడా వైభవ్ నిలిచాడు.
రికార్డుల వేట
సూర్యవంశీ దూకుడుతో టీమిండియా ఏ జట్టు కూడా చరిత్ర సృష్టించింది. కేవలం 5 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. లిస్ట్ ఏ వన్డే క్రికెట్ లో ఇదే అత్యంత వేగవంతమైన టీమ్ సెంచరీ అని రికార్డులు చెబుతున్నాయి. గతంలో న్యూజిలాండ్ 6.3 ఓవర్లలో చేసిన రికార్డును ఇండియా ఏ జట్టు తిరగరాసింది.
అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్ మొదటి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగాడు. జాహిద్ అలీ వేసిన తొలి ఓవర్ లోనే మూడు సిక్సర్లు కొట్టాడు. అభిషేక్ శర్మ 5 బంతుల్లో 12 పరుగులు చేసి అవుటైనా వైభవ్ ఏమాత్రం తగ్గలేదు.
గతంలో లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ (29 బంతులు) పేరిట ఉండేది. ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో, షకీబుల్ గని 32 బంతుల్లో, ఇషాన్ కిషన్ 33 బంతుల్లో సెంచరీలు సాధించారు. వైభవ్ ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ అధిగమించాడు.
యూఏఈ ఇన్నింగ్స్
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్ హర్ప్రీత్ సింగ్ భాటియా 144 బంతుల్లో 130 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. యూఏఈ స్కోరు 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో హర్ప్రీత్ సింగ్ ముహమ్మద్ షాదాద్ (28), ఏతాన్ డిసౌజాతో (25) కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.
బాసిల్ హమీద్ 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ 43 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా ఆరంభంలోనే వికెట్లు తీసి యూఏఈని దెబ్బతీశాడు.
