HMDA, కోకాకోలా మధ్య కీలక ఒప్పందం... రోజూ మొక్కలకు రూ. 6 లక్షల నీటి సరఫరా..!

HMDA, కోకాకోలా మధ్య కీలక ఒప్పందం... రోజూ మొక్కలకు రూ. 6 లక్షల నీటి సరఫరా..!

ఎల్ నినో కారణంగా ఏర్పడ్డ నీటి ఏడాదికి చెక్ చెప్పేందుకు సన్నాహాలు షురూ చేసింది HMDA. ఈ క్రమంలో కోకాకోలా సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది హెచ్ఎండీఏ. హైదరాబాద్‌ లోని ఓఆర్ఆర్ వెంట మొక్కలకు నీరందించేందుకు ప్రత్యేక చర్యల్లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకుంది హెచ్ఎండీఏ. ఇందులో భాగంగా ప్రతిరోజూ 6 లక్షల లీటర్ల శుద్ధి చేసిన వ్యర్థజలాల సరఫరా ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు అధికారులు.

సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లోని కోకాకోలా అవిన్య ప్లాంట్ నుంచి నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 నుంచి ఎగ్జిట్ 8 మధ్య ఉన్న మొక్కలకు ఈ నీటితో సాగునీరు అందించాలని నిర్ణయించారు అధికారులు. హెచ్‌ఎండీఏ నిర్వహణలో ఉన్న ఇతర గ్రీన్ బెల్ట్‌లలోనూ మొక్కలకు నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు.

పారిశ్రామిక అవసరాల తర్వాత శుద్ధి చేసిన వ్యర్థజలాలను పచ్చదనం కోసం వినియోగించనున్నట్లు తెలిపారు అధికారులు. మొక్కలకు నీరందించేందుకు మంచి నీటిని వినియోగించాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. భూగర్భ జలాల వినియోగం తగ్గించి మంచినీటి వనరులను కాపాడటమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

ఓఆర్ఆర్ వెంట పచ్చదనాన్ని ఏడాది పొడవునా కాపాడేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు అధికారులు. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. హెచ్‌ఎండీఏ తరఫున రోహిత్ గోపిడి, కోకాకోలా సంస్థ తరఫున మాధవన్ పిళ్లై ఒప్పందంపై సంతకాలు చేశారు.