గడచిన రెండు వారాలుగా బ్రేక్ లేకుండా దిగజారుతున్న బంగారం రేట్లు కొత్త వారంలో తిరిగి పుంజుకున్నాయి. దాదాపు దీపావళి నాటి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుదలతో ఇంకా రేట్లు తగ్గుతాయ్ అని ఆగుతున్న భారతీయులకు సోమవారం షాక్ తగిలింది. బులియన్ మార్కెట్లలో రేట్ల పతనం ఇంకా ఉంటుందా అనే అనుమానాలను పక్కన పెట్టి షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో మారిన రిటైల్ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్.
హైదరాబాద్ లో 2026, నవంబర్ 23వ తేదీ బంగారం ధరలు ఇలా ఉన్నాయి :
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 26 వేల 560 రూపాయలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : లక్షా 16 వేల రూపాయలు
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : 94 వేల 910 రూపాయలు
ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ సిటీలో కిలో వెండి : లక్షా 75 వేల రూపాయలు
నవంబర్ 23న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 148 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.12వేల 656గా కొనసాగుతోంది. సోమవారం రోజున రూ.లక్షా 26 వేల 560కి చేరుకుంది. అలాగే ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.11వేల 600గా కొనసాగుతోంది. అంటే 10 గ్రాముల బంగారం రేటు అంటే తులం రూ.లక్షా 16 వేల వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
ALSO READ : ఆయిల్, గ్యాస్ కంపెనీలకు కేంద్రం కొత్త రూల్స్
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 23, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.లక్షా 75వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.175 దగ్గర ఉంది.
