న్యూఢిల్లీ: భారత్, 27 దేశాల కూటమి యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) పై డిసెంబర్ 16న సంతకాలు జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్‌లో బ్రస్సెల్స్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం ఖరారై, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుందని ఈయూ రాయబారి జీన్-ఎరిక్ పాకెట్ వెల్లడించారు. 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణిస్తున్న ఈ ఒప్పందం ద్వారా 93 శాతం భారత ఎగుమతులపై ఈయూ మార్కెట్లోకి సుంకాలు పడవు. మరోవైపు, ఈయూ నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు, వైన్‌ల ధరలు తగ్గనున్నాయి. 20 ఏళ్ల చర్చల తర్వాత ఈ ఎఫ్‌టీఏ ఒక కొలిక్కి వచ్చింది.
