- కాంగ్రెస్‌లో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు: చాందీ ఊమెన్
కొట్టాయం (కేరళ): తప్పు తెలుసుకుని తిరిగి రావాలనుకునే వారందరికీ కాంగ్రెస్‌లో అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే చాందీ ఊమెన్ సూచించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాజీ సీఎం కె. కరుణాకరన్ కూతురు పద్మజ వేణుగోపాల్ తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఆదివారం కొట్టాయంలో మీడియాతో మాట్లాడారు.
బీజేపీలో చేరిన చాలామంది అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని తిరిగి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. అలాంటి వారందరికీ పార్టీలో చోటు కల్పించి, మరో ఐదేళ్లు పార్టీ కోసం పనిచేసే చాన్స్ ఇవ్వాలని సూచించారు.
