- నేడు ప్రధాని మోదీతో భేటీ
న్యూఢిల్లీ: నేపాల్ ప్రధానమంత్రి బాలేన్ షా రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. మార్చిలో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో బాలేన్ షా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ఈ భేటీలో ప్రధానంగా ఇంధనం, జలవిద్యుత్, రైల్వే లైన్ల అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు అజెండాగా ఉండనున్నాయి. చర్చల అనంతరం ఇరు దేశాల ప్రధానులు నేపాల్లో నిర్మించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభిస్తారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన కీలక ఒప్పందాలను మార్చుకోనున్నాయి.
విద్యుత్, వాణిజ్యం, రైల్వే ప్రాజెక్టులే కీలకం
భారత్–నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్కు నికర విద్యుత్ ఎగుమతుల ద్వారా నేపాల్ సుమారు 1,800 కోట్ల నేపాలీ రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు, సరిహద్దుల గుండా ప్రయాణికులు, సరుకు రవాణాకు వీలుగా రక్సౌల్–ఖాట్మండు మధ్య ప్రతిపాదిత రైల్వే లైన్ నిర్మాణంపై ఇరు దేశాలు చర్చిస్తున్నాయి.
