మంచు ముసుగులో రోడ్డు ప్రమాదం..నేరడిగొండలో ఢీకొన్న రెండు లారీలు

మంచు ముసుగులో రోడ్డు ప్రమాదం..నేరడిగొండలో ఢీకొన్న రెండు లారీలు
  •     తృటిలో తప్పిన పెను ముప్పు

నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ మండలంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే కశ్మీర్‌‌‌‌ను తలపించేలా దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా ఆదిలాబాద్​ నుంచి నిర్మల్ వైపు వెళ్లే నేష్నల్​ హైవే 44పై మండల కేంద్రానికి సమీపంలో మధ్యలో డివైడర్ కనిపించకపోవడంతో రోడ్డుకు అటువైపుగా వెళ్లడంతో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతినగా, ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

ఈ ప్రమాదంతో ట్రాఫిక్‌‌‌‌ అయ్యింది. సమాచారం అందుకున్న ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ రోడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఘటనా స్థలానికి చేరుకుని వన్‌‌‌‌వే ద్వారా వాహనాలను మళ్లించి ట్రాఫిక్‌‌‌‌ క్లియర్​ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొగమంచు కురుస్తున్న సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా ఫాగ్ లైట్లు వినియోగిస్తూ వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని సూచించారు.