హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (నవంబర్ 22) మధ్యాహ్నం మలక్ పేట్‌లోని రేస్ కోర్స్ వెళ్తుండగా చాదర్ ఘాట్ దగ్గర సీఎం కాన్వాయ్‌కు ఆవు ఎదురుగా వచ్చింది. అప్రమత్తమైన కాన్వాయ్ సిబ్బంది బ్రేక్ వేసి వాహనాలను స్లో చేశారు. వెంటనే అలర్ట్ అయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆవును అదుపు చేశాడు.
అనంతరం సీఎం కాన్వాయ్ రేస్ కోర్స్‌కు బయలుదేరింది. రేస్ క్లబ్లో జరగనున్న 'హైదరాబాద్ వింటర్ రేసెస్ 2026-27' నాలుగో రోజు గుర్రపు పందాలను సీఎం వీక్షించనున్నారు. సీఎం రేవంత్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాజసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో రేస్ క్లబ్ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
