తమిళనాడులోని థూత్తుకుడి జిల్లాలో దారుణం జరిగింది... 16 ఏళ్ళ తన ప్రియురాలు వేరొకరితో ఫోన్లో మాట్లాడుతోందని..గొంతు కోసి చంపేసి, అనంతరం గొంతు నులిమి చంపేశాడు ఓ యువకుడు. ఆదివారం ( నవంబర్ 22 ) వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... థుత్తుకుడికి చెందిన ముత్తురాజా తన ప్రియురాలు వేరొకరితో ఫోన్లో మాట్లాడుతోందని గొంతు కోసి చంపేసి.. తానూ కూడా ఆత్మహత్యత్నానికి పాల్పడ్డాడు.
స్థానిక వెల్డింగ్ షాపులో పనిచేసే ముత్తురాజా, తన ప్రియురాలు ఒకే ప్రాంతంలో నివసించేవారని... వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్నారని, అయితే ఇటీవల వీరి మధ్య విభేదాలు తలెత్తాయని దర్యాప్తులో తేలిందని తెలిపారు పోలీసులు. బాధితురాలు ఫోన్లో వేరే వ్యక్తితో మాట్లాడుతోందని ముత్తురాజా తరచూ ఆమెను అనుమానించేవాడని... ఈ విషయమై వారి మధ్య గతంలోనూ పలుమార్లు గొడవలు జరిగాయని తెలిపారు పోలీసులు.
శనివారం స్కూల్కు సెలవు కావడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని... ఆ సమయంలో ఆమె ఇంటికి వెళ్లిన ముత్తురాజా, మళ్లీ అదే విషయంపై ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆగ్రహానికి లోనైన ముత్తురాజా కత్తితో ఆమెపై దాడి చేశాడని తెలిపారు. బాలికను కత్తితో పొడిచి, ఆపై గొంతు నులిమి హత్య చేశాడని తెలిపారు. దాడి జరిగిన వెంటనే ముత్తురాజా అదే కత్తితో తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిపారు పోలీసులు. ముత్తురాజా తీవ్ర గాయాలతో అతడు ఇంట్లోనే కుప్పకూలిపోయాడని తెలిపారు పోలీసులు.
ముత్తురాజా కుప్పకూలడాని గమనించిన స్థానికులు వెంటనే ఇంటి లోపలికి వెళ్లి చూడగా బాలిక విగతజీవిగా పడి ఉందని తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ముత్తురాజాను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అతడిని థూత్తుకుడి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముత్తురాజా అక్కడ చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం సెబతైయాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందం సేకరించింది. నిందితుడు కోలుకున్న తర్వాత మరింత సమాచారం సేకరిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
